Site icon HashtagU Telugu

CMR Engineering College : CMR కాలేజీ హాస్టల్ వార్డెన్ అరెస్ట్

Police Arrested Cmr Enginee

Police Arrested Cmr Enginee

హైదరాబాద్ శివారు కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ( CMR Engineering College Girls Hostel ) హాస్టల్‌లో కెమెరాలు (CC Camera) పెట్టి రహస్యంగా వీడియోలు తీశారన్న ఆరోపణలతో విద్యార్థినుల ఆందోళన సంచలనంగా మారింది. విద్యార్థులు బాత్రూముల్లో కెమెరాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్, సైబరాబాద్ కమిషనర్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విద్యార్థుల ఆందోళనతో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

AP Cabinet Meeting : సంక్రాంతి తర్వాత మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ

ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి(Hostel Warden Prithi Reddy ) ని పోలీసులు అరెస్టు (Police Arrested) చేశారు. హాస్టల్ సిబ్బందిపై ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టారు. బాత్రూమ్‌ల పక్కనే వంట సిబ్బంది గదులు ఉండటం, వీడియోలు అక్కడి నుంచి తీసి ఉండవచ్చని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీ యాజమాన్యం వార్డెన్‌ను సస్పెండ్ చేసి, ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది.

మరోపక్క పోలీసులు హాస్టల్ సిబ్బందిపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారం పై మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వంట సిబ్బంది మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉందని, వారి కోణంలో విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకుని, 12 మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని , అయితే ఇప్పటివరకు ఎలాంటి అశ్లీల వీడియోలు లభించలేదని వెల్లడించారు.

ఇక విద్యార్థులు మాత్రం సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది బాత్రూమ్‌ల వెంటిలేటర్ల ద్వారా వీడియోలు తీశారని , వార్డెన్‌కు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ, ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.