Pocket Medical: మెట్రో గుడ్ న్యూస్.. ‘పాకెట్ మెడికల్ స్టోర్’ ప్రారంభం!

ఎల్అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ దవా దోస్త్ సహకారంతో ఖైరతాబాద్ మెట్రో రైల్ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం జనరిక్ మందులను విక్రయించే మెడికల్ షాపుల స్ట్రింగ్‌ను

  • Written By:
  • Publish Date - February 12, 2022 / 12:58 PM IST

ఎల్అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ దవా దోస్త్ సహకారంతో ఖైరతాబాద్ మెట్రో రైల్ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం జనరిక్ మందులను విక్రయించే మెడికల్ షాపుల స్ట్రింగ్‌ను శుక్రవారం ప్రారంభించింది. స్టోర్‌ను ఆవిష్కరించిన హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ “ఇప్పుడు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో పాకెట్-ఫ్రెండ్లీ మెడికల్ స్టోర్ ‘దవా దోస్త్’ అందుబాటులో ఉండటం ప్రయాణికుకులకు, సందర్శకులకు ఉపయోగకరంగా ఉంటుంది. 15 నుంచి 80 శాతం వరకు ఆకర్షణీయమైన తగ్గింపులతో జెనరిక్ ఔషధాలు, ఇతర ఫార్మా ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. త్వరలో అమీర్‌పేట్, KPHB, HITEC సిటీ, MGBSతో సహా ఇతర మెట్రో స్టేషన్‌లలో దావా దోస్త్ తన స్టోర్‌లను తెరవనుంది.

దేశంలో అతిపెద్ద మెట్రోల వరుసలో దిల్లీ మెట్రో తర్వాత స్థానం హైదరాబాద్‌దే. ఇక్కడ రోజువారీ సగటు ప్రయాణాలు 4.9 లక్షలకుపైనే ఉన్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ గతంలో తెలిపింది. అయితే, హైదరాబాద్‌ మెట్రోకు రోజువారీగా సగటున ప్రయాణాల లక్ష్యాన్ని 15 లక్షలుగా నిర్దేశించారు. ఒకవైపు కరోనా, మరోవైపు లాక్ డౌన్ పరిస్థితులు కారణంగా మెట్రో ఆదాయం ఘోరంగా పడిపోయింది. అయినా ప్రజల రాకపోకల కోసం నష్టాన్ని భర్తిస్తూ సేవలను కొనసాగిస్తున్నాయి. తమ ఆదాయంలో 50 శాతం వరకు టిక్కెట్ ధర నుంచే వస్తోందని ఎల్‌అండ్‌టీ చెబుతోంది. అంటే ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటే ఆదాయం పెంచుకునే అవకాశముంది.