Site icon HashtagU Telugu

Pocharam Srinivas Reddy : ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు – పోచారం

Pocharam Polls

Pocharam Polls

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై యావత్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. మొదటి నుండి కూడా తెలంగాణ ఎన్నికల ఫై ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు బిఆర్ఎస్ కు అధికారం కట్టపెట్టిన రాష్ట్ర ప్రజలు..మూడోసారి కూడా బిఆర్ఎస్ కే జై కొడతారా..? లేక కాంగ్రెస్ పార్టీ కి జై కొడతారా అనేది ఆసక్తి రేపింది. నెల రోజుల పాటు అన్ని పార్టీల నేతలు విస్తృతంగా పర్యటనలు చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. అదే స్థాయిలో ఓటర్లు సైతం పోలింగ్ లో పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పోలింగ్ పూర్తి కాగానే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కార్యకర్తలకు , శ్రేణులకు షాక్ ఇచ్చాయి. దాదాపు అన్ని పోల్ సర్వేలు కాంగ్రెస్ పార్టీ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు అని అధికార పార్టీ నేతలు చెపుతూ వస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ , కేటీఆర్ లు ఎగ్జిట్ పోల్స్ ఫై స్పందించగా..తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎక్జాట్ పోల్స్ వేరు అన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పార్టీలకు సంబంధాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఇస్తున్నారని తెలిపారు. పోలింగ్ పూర్తి కాకముందే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. సైలెంట్ ఓటు కేసీఆర్ కు అనుకూలంగా ఉందన్నారు. బీఆర్ఎస్ 70 నుంచి 75 సీట్లు పక్క అని ధీమా వ్యక్తం చేశారు. మాస్ ఓటర్ వేరు.. క్లాస్ ఓటర్ వేరు అని అన్నారు. క్లాస్ ఓటర్ బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు.

Read Also : New Wine Shops : తెలంగాణ లో కళకళాడుతున్న కొత్త మద్యం షాపులు