Covid: స్పీకర్ పోచారంకు కరోనా.. మనువరాలి పెళ్లిలోనే సోకిందా..?

పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం.. ఇతర శుభాకార్యాలు, ఫంక్షన్లు జరుగుతుండటంతో పాటు మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో మళ్లీ కరోనా వ్యాప్తి చెందుతోంది.

  • Written By:
  • Updated On - November 25, 2021 / 12:54 PM IST

పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం.. ఇతర శుభాకార్యాలు, ఫంక్షన్లు జరుగుతుండటంతో పాటు మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో మళ్లీ కరోనా వ్యాప్తి చెందుతోంది. రెండురోజుల క్రితమే ఖమ్మంలోని గురుకుల విద్యార్థినులు 28 మంది కరోనా బారిన పడగా, తాజాగా స్పీకర్ పోచారం కు సోకింది.

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించుకోగా కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని కోరారు.

గత నాలుగు రోజుల క్రితమే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో వివాహం ఘనంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌ గారు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు హాజరయ్యారు. అంతేకాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే మనువరాలి పెళ్లి తర్వాతనే స్పీకర్ కరోనా సోకడం ఆందోళన కలిగించే విషయం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పీకర్ తో కాంటాక్ట్ అయ్యారు. అయితే ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు మాస్కులు, భౌతిక దూరం పాటించలేదు. పైగా ఇద్దరు దాదాపు 30 నిమిషాలపాటు పలు విషయాలపై చర్చించుకున్నారు. స్పీకర్ పోచారం కు కొవిడ్ సోకిన నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.