తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం (LB Stadium) లో బిజెపి తలపెట్టిన ‘బీసీ ఆత్మగౌరవ సభ’ (BC Atma Gourava Sabha) మోడీ మాట్లాడుతూ.. తెలంగాణ లో బిజెపి గెలిస్తే..బీసీ నేతే సీఎం అవుతాడని ప్రకటించారు. ఈ సభకు మోడీ (Modi) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు ముఖ్య అతిధులుగా హాజరు కాగా..సభ అంత బిజెపి , జనసేన కార్యకర్తలతో జనసంద్రంగా మారింది.
ఈ సందర్బంగా మోడీ (Modi) మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంతో తనకు మంచి అనుబంధం ఉందని.. పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధానిని అయ్యానని గుర్తు చేసారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ బీసీని ఎందుకు సీఎం చేయడం లేదని మోడీ ప్రశ్నించారు.
తెలంగాణలో తొమ్మిదేళ్ళుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పాలన సాగుతోందని ప్రధాని ఆరోపించారు. నవంబర్ 30న ఈ విరోధి సర్కార్ ను విసిరి కొట్టాలని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ సర్కార్ దళిత, ఆదివాసీలకు ప్రియారిటీ ఇస్తోందన్నారు. రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామని.. గిరిజన బిడ్డను ఇప్పుడు రాష్ట్రపతిని చేశామని స్పష్టం చేసారు. ఓబీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఇవ్వలేదని , కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీలున్నారని అన్నారు ప్రధాని. డెంటల్ కాలేజీల్లో 27 శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్‌గా ఉన్నాయన్నారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు ఆ రెండు పార్టీల లక్షణాలు అని విమర్శించారు. కాంగ్రెస్… బీఆర్ఎస్ సీ టీమ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదని గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీజేపీయే అన్నారు. బీసీల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు. బీసీలకు ఏడాదికి రూ.1000 కోట్ల ఫండ్స్ ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది కానీ చేయలేదన్నారు.
బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందన్నారు. ఆ పార్టీ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో అవినీతిని అంతం చేస్తాం… ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కాం కేసును దర్యాఫ్తు చేస్తుంటే ఇక్కడి నేతలు సీబీఐ, ఈడీని తిడుతున్నారన్నారు. అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి నుంచి తిరిగి రాబడతామన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ బీఆర్ఎస్ వైఫల్యం అన్నారు. అన్ని నియామక పరీక్షలలో అవకతవకలు ఇక్కడ కామన్ అయ్యాయన్నారు. తెలంగాణకు మోసం చేసిన బీఆర్ఎస్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు.
Read Also : Goshamahal BRS Candidate : గోషామహల్ బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్