PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ వివరాలివీ..

  • Written By:
  • Updated On - March 4, 2024 / 11:43 AM IST

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు.  ఈ రెండు రోజుల టూర్‌లో భాగంగా ఆయన రూ.56వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వీటిలో విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పర్యటనల వివరాలు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • ప్రధాని మోడీ ఇవాళ ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు వెళ్తారు. అక్కడి ఆడిటోరియం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌లు ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. ఈసందర్భంగా రూ.6,697 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుడతారు. రామగుండం నేషల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు.
  • హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకూ రూ.2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రధాని ప్రారంభిస్తారు. దీనితో పాటు మరిన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా మోడీ చేస్తారు.
  • ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని టూర్ ముగుస్తుంది.
  • ఆదిలాబాద్ నుంచి ప్రధానమంత్రి తమిళనాడు వెళ్తారు. తిరిగి రాత్రి 7.45 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. రాత్రికి నగరంలోని రాజ్‌భవన్‌లో బస చేస్తారు.
  • మార్చి 5న ఉదయం 11 గంటలకు సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ రూ.9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఐఐటీ, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్‌లైన్ వంటి వాటిని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.

Also Read : Congress MP Candidates : 14 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా ?

10 రోజుల పర్యటన విశేషాలివీ.. 

  • ప్రధాని మోడీ (PM Modi) నేటి నుంచి 10 రోజుల్లో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు.తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్‌, బిహార్‌, జమ్మూకశ్మీర్‌, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీల్లో ప్రధాని పర్యటిస్తారు.
  • మార్చి 5న  తెలంగాణలోని సంగారెడ్డి పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఒడిశాకు వెళ్లి చండీఖోలేలో బహిరంగ సభలో మాట్లాడతారు.
  • మార్చి 6న కోల్​కతాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం బరాసత్​లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత బిహార్​కు వెళ్లి బెట్టియాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
  • మార్చి 7న ప్రధానమంత్రి మోడీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించి సాయంత్రం తిరిగి ఢిల్లీకి చేరుకొని ఓ మీడియా ఈవెంట్‌లో పాల్గొంటారు.
  • మార్చి 8న  ఢిల్లీలో జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం అసోంలోని జోర్హాట్​లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. జోర్హాట్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించనున్నారు. ఇటానగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బంగాల్​లోని సిలిగుఢిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభల్లో మోడీ ప్రసంగిస్తారు.
  • మార్చి 10 న ఉత్తరప్రదేశ్​లో పర్యటించి అజాంగఢ్‌లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
  • మార్చి 11న  ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హరియాణా సెక్షన్‌ను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి, రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లలో పలు కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. మార్చి 13న గుజరాత్‌, అసోంలో మూడు ముఖ్యమైన సెమీకండక్టర్ల ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

Also Read :Vegetable Soup: ఈ ఆకుకూరల సూప్ తో ఇలా చేస్తే.. ఈజీగా బరువు తగ్గాల్సిందే?