PM Modi : ‘తెలంగాణ’ దశాబ్ది వేడుకల వేళ తెలుగులో మోడీ ట్వీట్

తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
PM Modi To Italy

PM Modi To Italy

PM Modi : తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలుగులో ఓ ట్వీట్ చేశారు. ‘‘ దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతలు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని ప్రధానమంత్రి(PM Modi) పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ను రేవంత్ విస్మరిస్తున్నారు : లక్ష్మణ్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమం సమయంలో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నారని తెలిపారు. ‘‘రేవంత్ సీఎం అయ్యాక బలి దేవత, తెలంగాణ దేవత అయిందా..? అట్లాంటి బలి దేవతను ఎట్లా ఆరాధిస్తున్నారు..?’’ అని ఆయన ప్రశ్నించారు.  ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ రెడ్డి రాజకీయ వివాదాలను సృష్టించి కాలం గడుపుతున్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ను రేవంత్ విస్మరిస్తున్నారు. దీనిపై కోదండరాం నోరు మెదపకపోవడం దేనికి సంకేతం ? ’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఉద్యమం వేళ తెలంగాణ ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇస్తామని ఆనాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లోక్ సభ,రాజ్యసభలో తెలంగాణ కోసం గళమెత్తారు’’ అని లక్ష్మణ్  గుర్తు చేశారు. తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదని ఆయన చెప్పారు. 12వందల మంది బలిదానాల మీద తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు కళాకారులు, ఉద్యమకారులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :BRS Win : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం

‘‘కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిళ్లకు లొంగిపోయి బీఆర్ఎస్‌తో రేవంత్ రెడ్డి లాలూచీ పడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదు ?’’ అని లక్ష్మణ్   ప్రశ్నించారు. ‘‘మోడీ  వైపు తెలంగాణ ప్రజలు ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలి’’ అని పేర్కొన్నారు. కవులు కళాకారులు, ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే రేవంత్ రెడ్డికి ఈ ఐదేళ్లు కష్టంగా ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈసందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను లక్ష్మణ్ సన్మానించారు.

Also Read :Telangana Formation Day 2024 : తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

  Last Updated: 02 Jun 2024, 11:49 AM IST