Site icon HashtagU Telugu

Modi cylinder Video: సిలిండర్ పై మోడీ ఫొటో.. వైరల్ అవుతున్న వీడియో!

Modi

Modi

తెలంగాణలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె బీర్కూర్‌లోని చౌకధరల దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్మలా సీతరామన్ పై ఎదురుదాడికి దిగారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పలు కేంద్ర పథకాలపై కూడా కేసీఆర్ ఫొటో పెట్టాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సీతరామన్ కామెంట్స్ పై వ్యంగ్యంగా స్పందిస్తూ పలువురు గ్యాస్‌ సిలిండర్ల ఆటోకు సంబంధించిన వీడియోను నెట్టింట్లో వైరల్‌ చేస్తున్నారు. ఈ వీడియోలో గ్యాస్‌ సిలిండర్లపై ‘మోదీజీ రూ.1105’ అనే వ్యాఖ్యతో ప్రధాని ఫొటోలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విటర్లలో పోస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది.

Exit mobile version