KCR Vs Modi : నా అరెస్టుకూ మోడీ కుట్ర.. కేసీఆర్ సంచలన ఆరోపణ

KCR Vs Modi : తనను అరెస్టు చేయించి జైల్లో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ  చాలా ప్రయత్నాలే చేశారని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - May 7, 2024 / 10:28 AM IST

KCR Vs Modi : తనను అరెస్టు చేయించి జైల్లో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ  చాలా ప్రయత్నాలే చేశారని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. అయితే తానెక్కడా అవినీతికి పాల్పడకపోవడం వల్లే మోడీకి దొరకలేదన్నారు. ఈక్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు పేరుతో మోడీ తనపై భయంకరమైన కుట్ర చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్ పార్టీకి​ 12 లోక్​సభ స్థానాలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని గులాబీ బాస్ జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, బిహార్‌, బెంగాల్‌లలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి వచ్చే సీట్లు అంతంత మాత్రమేనని కేసీఆర్(KCR Vs Modi) అంచనా వేశారు.

We’re now on WhatsApp. Click to Join

నా కుమార్తె కవితను తీసుకెళ్లి జైల్లో పెట్టారు

‘‘బీజేపీతో కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించాల్సిన  అవసరం మాకు లేదు. బీజేపీతో మాకు సంబంధం ఉందనడం హాస్యాస్పదం. ఆడబిడ్డ అని కూడా చూడకుండా అప్రజాస్వామికంగా, అరాచకంగా, క్రూరంగా నా కుమార్తె కవితను తీసుకెళ్లి మోడీ జైల్లో పెట్టారు’’ అని కేసీఆర్ చెప్పారు.  ‘‘గత పార్లమెంటు ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. వాళ్లు తెలంగాణ కోసం గడ్డిపోచంత పనైనా చేశారా? ఒకాయన ఐదేళ్లుగా కేంద్రమంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గానికి రూ.5 విలువ కలిగిన పని కూడా చేయలేదు. సికింద్రాబాద్‌ స్థానాన్ని మేం బంపర్‌ మెజారిటీతో గెలవబోతున్నాం’’ అని గులాబీ బాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.  ‘‘బీజేపీ ఎంపీలు గెలిచినా చేతులు కట్టుకొని నిలబడతారే తప్ప వారితో ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్‌ కూడా ఇదే బాపతు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్‌లోనూ కాంగ్రెస్‌ ఓడిపోబోతోందన్నారు.

Also Read : NEET PG Exams : నీట్ పీజీ పరీక్షల్లో ‘టైమ్-బౌండ్ సెక్షన్’.. ఏమిటిది ?

ఫోన్‌ ట్యాపింగ్‌‌తో మాకేం సంబంధం?

‘‘తెలంగాణలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో మాకేం సంబంధం? ఇప్పటి ప్రభుత్వం ఇంత తెలివితక్కువగా ఆలోచిస్తుందని నేను అనుకోలేదు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదికలివ్వడం అత్యంత సహజ పరిణామం. సీఎం, మంత్రుల చేతికి రిపోర్ట్‌లు వస్తాయి కానీ, వాళ్లు ట్యాపింగ్‌ చేశారా? లేదా? అనేది మాకేం తెలుస్తుంది? అది మా పరిధిలోకే రాదు. అసలది ఆరోపణే కాదు’’ అని కేసీఆర్ తెలిపారు.

Also Read :Meenakshi Chaudhary : బాపు బొమ్మగా మీనాక్షి చౌదరి.. శారీ లుక్ తో కెవ్వు కేక..!

బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది

‘‘బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేసినా చేస్తుంది. అందులో అనుమానమేం లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త గోల్వల్కర్‌ సిద్ధాంతంలోనే ఇది ఉంది. ఆయనకు మోడీ శిష్యుడే. బీజేపీ  వాళ్ల పద్ధతి చూస్తుంటే.. తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేస్తారన్న అనుమానాలున్నాయి’’ అని కేసీఆర్ కామెంట్ చేశారు. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు.