Site icon HashtagU Telugu

pm Modi: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని మోడీ పూజలు

Pm Modi Worships At Mahanka

Pm Modi Worships At Mahanka

 

Ujjaini Mahankali Temple : ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలంగాణ(telangana)లో రెండు రోజుల పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు (మంగళవారం) సికింద్రాబాద్ మహంకాళి(Ujjaini Mahankali) అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల్లో మోడీ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి దర్శనానంతరం బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకొని, అక్కడి నుంచి సంగారెడ్డి పర్యటనకు వెళ్లారు.

సంగారెడ్డి(Sangareddy)పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం పటాన్‌చెరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న మోడీ… తెలంగాణ పర్యటన ముగించుకుని ఒరిస్సాకు పయనం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన సంగారెడ్డి చేరుకోనున్నారు. 10.45 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడతారు. రూ.6,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పటేల్‌గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వర్చువల్‌గా ఆయన పాల్గొంటారు. రూ.1409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి క్రాస్ రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు రూ.1298 కోట్లతో ఎన్‌హెచ్-65ని ఆరు లేన్ల విస్తరణ పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఇక మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో ఎన్‌హెచ్765డీ మెదక్-ఎల్లారెడ్డి హైవే విస్తరణ, రూ.500 కోట్లతో ఎల్లారెడ్డి-రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

 అనంతరం జిల్లాలోని పఠాన్‌చెరులో 11.20 గంటలకు నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సభాస్థలికి వచ్చేవారు ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని అధికారులు సూచించారు. కాగా ప్రధాని మోదీ నిన్న (సోమవారం) ఆదిలాబాద్‌లో పర్యటించారు. అనంతరం తమిళనాడు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

read also Narendra Modi : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు