PM Modi – Mahabubnagar : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలోని మహబూబ్నగర్ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోడీ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం 1.35 గంటలకు మహబూబ్ నగర్ కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్ హెలి ప్యాడ్ వద్దకు చేరుకోనున్న మోడీ, మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రూ.13,500 కోట్లతో చేపట్టనున్న పలు డెవలప్మెంట్ వర్క్స్ కు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు.
Also read : Afghanistan Embassy : తాలిబన్ల సంచలన ప్రకటన.. ఇండియాలో ఎంబసీ బంద్.. ఎందుకంటే ?
నాగ్ పూర్-విజయవాడ ఎకానమిక్ కారిడార్ కు శంకుస్థాపన చేస్తారు. భారత్ పరియోజన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ ను జాతికి అంకితం ఇస్తారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఫైప్ లైన్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్-రాయచూరు ట్రైన్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ఆరు కొత్త భవనాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. సాయంత్రం 4.10 గంటలకు మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరి (PM Modi – Mahabubnagar) వెళుతారు. ప్రధాని మోడీ అక్టోబర్ 3న మళ్లీ తెలంగాణకు వస్తారు. ఆ రోజు మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.