Site icon HashtagU Telugu

PM Modi: మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన

Pm Modi

Pm Modi

PM Modi: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు . పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మోదీ , ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు యాత్రల పేరుతో ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ముందుకు సాగుతోంది.

Also Read: Health: కార్డియాక్ అరెస్టు తో జర జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే