Site icon HashtagU Telugu

Vande Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు

Vande Bharat Express

Vande Bharat Exp

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కానుకను అందించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కంటే నాలుగు రోజుల ముందుగానే సికింద్రాబాద్ – విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు (Vande Bharat Express) పరుగులు పెట్టనుంది. జనవరి 15న సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకానున్నారు.

దేశంలో ఇది ఎనిమిదో వందే భారత్ రైలు. ఇది సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య సుమారు ఎనిమిది గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. రైలుకు స్టాప్‌లలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేష్టన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది.

52 మంది కూర్చునే మొదటి శ్రేణి కోచ్‌లు రెండున్నాయి. కోచ్‌ పొడవు 23 మీటర్లు. ప్రత్యేకంగా స్లైడింగ్‌ డోర్లు, అటెండెంట్‌ కాల్‌ బటన్లు, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ, పడుకునే సౌకర్యం కలిగిన కుర్చీలు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన రైలు ఢీకొనడం నివారించే వ్యవస్థ – కవాచ్‌తో సహా అధునాతన అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.