Site icon HashtagU Telugu

Modi @Hyd : నేడు బీజేపీ విజ‌య్ సంక‌ల్ప స‌భ… భారీగా ఏర్పాట్లు చేసిన బీజేపీ

Modi Pm

Modi Pm

హైదరాబాద్: నేడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ‘విజయ్ సంకల్ప సభ’ పేరుతో జరిగే ఈ బహిరంగ సభలో తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సన్నద్ధమ‌వ‌తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగంపై అందరిలో ఆస‌క్తి నెల‌కొంది. బహిరంగ సభకు 35 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది.

రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యంగా గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో ప్రధాని పార్టీకి రోడ్‌మ్యాప్ ఇస్తారని భావిస్తున్నారు.

తన ప్రసంగంలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు అట్టడుగు వర్గాలతో కనెక్ట్ అయ్యేలా ఎలా పని చేయాలో ఆయన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయాలను కూడా ఆయన వెలుగులోకి తెస్తారని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తారని భావిస్తున్నారు.కోవిడ్-19 మహమ్మారి తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల పూర్తి భాగస్వామ్యంతో సమావేశం జరగడం ఇదే తొలిసారి. నవంబర్ 2021లో జరిగిన చివరి సమావేశం హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది.

మోగా రోడ్‌ షో కోసం హైదరాబాద్ నగరం మొత్తం బీజేపీ జెండాలు, బ్యానర్లతో కాషాయ రంగును సంతరించుకుంది. పోస్టర్లు కేంద్ర ప్రభుత్వ ఘనతను చాటుతున్నాయి. నగరంలోని ప్రతి సందు పెద్ద పెద్ద కటౌట్లు వెలిశాయి.

Exit mobile version