Site icon HashtagU Telugu

PM Modi : ఫామ్‌హౌజ్‌లో పడుకునే సీఎం మనకు అవసరమా..? – మోడీ

Modi Toopran

Modi Toopran

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో(Telangana Election Campaign) భాగంగా ఆదివారం తూప్రాన్‌ (Toopran) లో ఏర్పాటు చేసిన బిజెపి భారీ బహిరంగ సభ (Modi Toopran Public Meeting)లో ప్రధాని మోడీ (PM Modi)పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ (KCR) అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని..ఎప్పుడు ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. త్వరలోనే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ఫామ్ హౌస్‌కు పంపిస్తున్నారని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వారసత్వ రాజకీయాల వల్ల వ్యవస్థ నాశనం అయ్యిందని మండిపడ్డారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణ నిధులన్నీ కేసీఆర్ తన కుటుంబానికి మళ్లించారన్నారు. నీళ్లు, నిధులు పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దోచుకున్న కేసీఆర్… ఇప్పుడు దేశంపై పడ్డారన్నారు. దేశంలో లూటీ చేసేందుకు దిల్లీలో ఒక నేతతో చేతులు కలిపారని విమర్శించారు. దిల్లీ నేతలతో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యప్తు కొనసాగుతోందని మోడీ తెలిపారు. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ హామీలను విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్ కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే న్యాయం చేశారని సెటైర్ వేశారు. కేసీఆర్ తెలంగాణను తన జాగీరు అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్‌పై రైతులతో పాటు ఆ మల్లన్న స్వామి కూడా ఆగ్రహంగా ఉన్నాడన్నారు. తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగలేదని.. కానీ బీజేపీ మాత్రం బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. బీజేపీతోనే సౌకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యం అని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ మాత్రమే చూశారు.. ఇక సినిమా చూస్తారని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also : November Deadlines: నవంబర్ 30వ తేదీలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే..!