Modi React’s on Sharmila issue: షర్మిల ఇష్యూపై ‘మోడీ’ రియాక్షన్.. జగన్ సైలంట్!

ఢిల్లీలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ కు మోడీ నుంచి అన్యూహ్య ప్రశ్న ఎదురైంది.

  • Written By:
  • Updated On - December 6, 2022 / 02:55 PM IST

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM)కి అనూహ్యకరమైన సంఘటన ఎదురైంది. జీ20 సమావేశాలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు హాజరైన విషయం తెలిసిందే. మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని ఏపీ సీఎం జగన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముఖ్యమంత్రులతో ఇంటరాక్షన్ అవుతుండగా, ప్రధాని నరేంద్ర మోడీ జగన్ రెడ్డి  (AP CM) వేసిన ఓ సూటీ ప్రశ్న ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

షర్మిల దాడిపై మోడీ ప్రస్తావన

ఇటీవల తెలంగాణలో వైఎస్‌ షర్మిలపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి చేసి నిర్బంధించారనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సీఎంను ప్రశ్నించడంతో జగన్ తెల్లముఖం వేశారు. తెలంగాణలో షర్మిల ఎదుర్కొన్న దానిపై మీ స్పందన ఏమిటని ప్రధాని జగన్ రెడ్డిని అడిగారు. వరంగల్ జిల్లాలో షర్మిల కాన్వాయ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడి చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఘటనను ఆయన ప్రస్తావించారు. ‘ఆ విషయం తెలిసి నాకే బాధ కలిగింది. ఇంత జరిగినా మీరెందుకు మాట్లాడలేదు?’ అని నేరుగా జగన్‌నే ప్రశ్నించారు. దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక.. జగన్‌ తనదైన శైలిలో నవ్వుతూ మౌనంగా నిల్చున్నట్లు తెలిసింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక నవ్వుతో మౌనంగా నిల్చున్నారు. అయితే జగన్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, ఇతర నేతలతో మోడీ మాట్లాడుతూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వరంగల్ జిల్లాలో నర్సంపేటలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆమె బస్సుతో పాటు కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు టీఆర్ఎస్ నాయకులు. దీంతో షర్మిల తెలంగాణ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రగత్ భవన్ ముట్టడికి బయలుదేరారు. అయితే షర్మిల కారులోనే ఉండగా పోలీసులు క్రేన్ సాయంతో తరలిండంచడం కూడా చర్చనీయాంశమైంది. కారు డోర్ ను ఓపెన్ చేసిన అనంతరం మహిళ పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల మండి పడ్డారు. పోలీసులు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బందిపోట్ల రాష్ట్ర సమితిగా తయారైందని అన్నారు. షర్మిల అరెస్ట్ ఘటనపై గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మోడీ (PM Modi) షర్మిల ప్రస్తావన తీసుకురావడం తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ గైర్హాజరు

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కెసిఆర్ ను సమావేశానికి ఆహ్వానిస్తూ నవంబర్ 23న కేంద్రం నుంచి లేఖ అందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశానికి తెరాస తరుపున ఎవరూ హాజరు కాలేదు. కాగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన జి20 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఏక్నాథ్ షిండే, అరవింద్ కేజ్రీవాల్, జగన్ మోహన్ రెడ్డి, ఎం.కె. స్టాలిన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

Also ReadIT Raids: హైదరాబాద్ బిల్డర్స్ పై ఐటీ రైడ్స్!