Site icon HashtagU Telugu

MLC Kavitha: తొమ్మిదేళ్లకు ఒకసారి కూడా మీడియా సమావేశం పెట్టి ప్రశ్నలకు సమాధానం చెప్పని ప్రధాని మోదీ…

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

పటాన్ చెరు : తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా సీఎం కేసీఆర్ తో కలం వీరులు నడిచారని, జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. పటాన్ చెరులోని GMR కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన TWJ స్టేట్ సెకండ్ కాంగ్రెస్ & ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) 10వ ప్లీనరీలో MLC కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ప్రసారాలు చేసే వారు కూడా నిబద్ధతతో ఉన్నప్పుడు మీడియా సంస్థల విశ్వసనీయతతో పాటు ప్రసారమయ్యే వార్తలపై నమ్మకం కలుగుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వార్తలపై సమాజం విశ్వాసం కోల్పోయిందని చెప్పడం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు వార్తలు రాసి ప్రభుత్వం పరువు తీసేలా వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇలాంటి కుట్రలపై జర్నలిస్టులు కూడా ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించలేదని, ఏ ఒక్క జర్నలిస్టు సంఘం కూడా దీనిని ప్రశ్నించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వందలాది మంది జర్నలిస్టులతో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారని, జర్నలిస్టులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతారని, సమస్యలకు పరిష్కారాలు చూపుతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయ నేతలు పారదర్శకంగా, నిబద్ధతతో మెలగాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) కేంద్రాన్ని డిమాండ్ చేయాలని, బీఆర్ ఎస్ పార్టీ కూడా మద్దతుగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు.