Site icon HashtagU Telugu

PM Modi:ఓ కుటుంబం తెలంగాణను దోచుకోవాలని ప్రయత్నిస్తోంది-ప్రధాని మోదీ..!!

Pmmodi

Pmmodi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీకి…తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్ పోర్టులోఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. టీఆరెస్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

పట్టుదలకు , పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలని మోదీ అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ పోరాటం జరగలేదని పేర్కొన్న ఆయన…తెలంగాణలో కుటుంబ పాలన చేసేవారే దేశద్రోహులు అంటూ మండిపడ్డారు. ఆ కుటుంబం అధికారంలో ఉండి దోచుకోవాలని ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. కుటుంబ పార్టీ స్వలాభం ఎలా ఉంటుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పేదల సమస్యలు ఆ పార్టీకి పట్టవని విమర్శించారు. యువత ఆకాంక్షలను సర్కారు పట్టించుకోవడం లేదని…కుటుంబ దోపిడికి తెలంగాణ బలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. టీఆరెస్ పాలన అంతాకూడా అవినీతిమయమన్న మోదీ…తెలంగాణలో మార్పు తథ్యం అన్నారు. గతంలోజరిగిన ఎన్నికలు స్పష్టమైన సంకేతాలు ఇఛ్చయన్నారు. తెలంగాణలోబీజేపీ రావడం ఖామన్నారు మోదీ. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాల పేరు పెడుతున్నారని, పథకాల్లో రాజకీయం చేస్తే ప్రజలు నష్టపోతారన్నారు

టీఆరెస్ ఓ పార్టీకి గులాంగా మారి పనిచేస్తోందని మోదీ విమర్శించారు. 21వ శతాబ్దంలోనూ కొందరు మూఢవిశ్వాసాలు నమ్ముతున్నారని మండిపడ్డారు. మూఢనమ్మకాలు తెలంగాణ అభివ్రుద్ధికి అడ్డంకిగా మారాయాన్నారు. మూఢవిశ్వాసాలను నమ్మిన ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం ఉండరని స్పష్టంచేశారు. తాను టెక్నాలజీని నమ్ముతానని…మూఢనమ్మకాలను కాదని మోదీ వివరించారు.