Site icon HashtagU Telugu

PM Modi – CM Revanth : ప్రధాని వద్ద సీఎం రేవంత్ చర్చించిన అంశాలు ఇవే..

Cm Revant Modi

Cm Revant Modi

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..గురువారం ప్రధాని మోడీ (PM Modi) తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పాల్గొన్నారు. సుమారు గంట‌సేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై ప్రధాని మోడీతో సీఎం చ‌ర్చించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని ప్రధాని మోదీని కోరినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. బొగ్గు గ‌నుల కేటాయింపు, ఐటీఐఆర్ పున‌రుద్ధ‌ర‌ణ‌, ర‌క్ష‌ణ భూముల కేటాయింపు, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలపై చర్చించారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించడం.. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని రిక్వెస్ట్ చేసారు.

రాష్ట్రానికి ఐఎంఎం ఇవ్వాలని కోరడంతో పాటు గత ప్రభుత్వం సాంక్షన్ చేసిన ఐటీఆర్ ప్రాజెక్ట్‌ను పునరుద్దరించాలని అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, జిల్లాలకొక నవోదయ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశాయని, విజభన చట్టంలోని పెండింగ సమస్యలను త్వరగా పరిష్కారించాలని , రాష్ట్ర రహదారులను జాతీయ హై వేలుగా మార్చాలని ప్రధానిని కోరినట్లు సీఎం రేవంత్ తెలిపారు.

Read Also : Venu Swamy : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుంది.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఫిక్స్..