PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అంటూ పలికారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని అన్నారు.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 06:15 AM IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అంటూ పలికారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని అన్నారు. ఈ భాగ్యనగర్ లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్ భారత్ అనే నినాదాన్ని ఇచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలను మరింత వివరిస్తూ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మోదీ హైదరాబాద్ అందరికీ ఎంతోవిలువైన భాగ్య నగర్ అని పేర్కొన్నారని తెలిపారు. సర్దార్ పటేల్ ఇక్కడేదేశాన్ని ఏకం చేయడానికి పునాదలు వేసినట్లు వివరించారు. ఇప్పడు ఈ ప్రక్రియ మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు.

కాగా బీజేపీ దాని మాతృసంస్థ RSSలు హైదరాబాద్‌ పేరు మార్చాలని పలుసార్లు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలన్నాయి. మోదీ స్వయంగా హైదరాబాద్ ను భాగ్యనగర్ అని పలకడంతో పేరు మార్పుతో మారోసారి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పేరు మార్చే డిమాండ్ ను బీజేపీ బలంగా ముందుకు తీసుకువస్తుందా అనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి పియూష్ గోయల్ ను ఈ విషయంపై ప్రశ్నించగా…ఆయన దాదాపు ఔను అనే సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినతర్వాత అప్పటి ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులతో కలిసి నిర్ణయం తీసుకుంటారని పియూష్ గోయల్ అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఢిల్లీ వెలుపల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం ఇది 4వసారి.