PM Modi : తెలంగాణకు ‘పసుపు బోర్డు’.. ములుగులో ‘సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ’ : ప్రధాని మోడీ

PM Modi : మహబూబ్ నగర్ లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటనలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Lok Sabha Elections

Pm Modi

PM Modi : మహబూబ్ నగర్ లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. ములుగు జిల్లాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని స్థాపిస్తామని వెల్లడించారు. దీని నిర్మాణానికి రూ.900 కోట్లను ఖర్చు పెట్టబోతున్నామని తెలిపారు.  ‘‘తెలంగాణ ప్రజలకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నాను. తెలంగాణ ప్రజల ప్రేమ, స్నేహానికి ముగ్ధుడినయ్యాను’’ అని ప్రధాని చెప్పారు.తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Also read : Shock To Hafiz Saeed : ‘లష్కరే’ చీఫ్ హఫీజ్ సయీద్ కు షాక్.. సన్నిహితుడి మర్డర్

హైదరాబాద్-విశాఖ కారిడార్ వల్ల సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఉపయోగం కలుగుతుందని తెలిపారు.  ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్, 5 మెగా ఫుడ్ పార్కులు, 4 సీపోర్ట్ క్లస్టర్స్, 3 ఫార్మా మెడికల్ క్లస్టర్లు, 1 టెక్స్ టైల్ క్లస్టర్ ల పనులను ప్రధాని ప్రారంభించారు. వీటివల్ల హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. కృష్ణపట్నం-పాలమూరు మధ్య మల్టీ పర్పస్ పెట్రో పైప్ లైన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, దీనివల్ల యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోడీ వివరించారు. ఈ పెట్రో పైప్ లైన్ ద్వారా ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ రవాణాకు మార్గం సుగమం అవుతుందన్నారు. మహబూబ్ నగర్ వేదికగా ఇవాళ  మొత్తం రూ.13,500 కోట్ల ఖర్చుతో  పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని ప్రధాని తెలిపారు.

హైదరాబాద్- రాయచూరు ట్రైన్

ప్రధాని మోడీ నాగ్ పూర్- విజయవాడ ఎకనమిక్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు. భారత్ పరియోజన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- విశాఖపట్నం కారిడార్ ను జాతికి అంకితం చేశారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఫైప్ లైన్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్- రాయచూరు ట్రైన్ ను ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ఆరు కొత్త భవనాలను ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు.

  Last Updated: 01 Oct 2023, 03:48 PM IST