Site icon HashtagU Telugu

PM Modi: హైదరాబాద్ లో మోడీ బహిరంగ సభ!

Modi

Modi

జూలై 3వ తేదీన హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఈ బహిరంగ సభకు నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని టిఆర్ఎస్ జాతీయ స్థాయిలో కాషాయ పార్టీని ఎదుర్కొనేందుకు కూటమిగా ఏర్పడే ప్రయత్నంలో ఉండగా, రాష్ట్రంలో పార్టీ తన ఉనికిని విస్తరించాలని కోరుతున్న తరుణంలో హైదరాబాద్ లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది.

గతంలో ప్రధాని మోడీ రెండు సార్లు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ అందుబాటులో లేకుండా ముఖం చాటేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జులై 1 నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version