Telangana TDP : టీడీపీ తెలంగాణలోకి రీ ఎంట్రీ ఇవ్వనుందా ? ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కసరత్తు చేస్తున్నారా ? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే సమాధానమే చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్, పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షోటైమ్ రాబిన్ శర్మలతో చంద్రబాబు, లోకేష్ భేటీ అయ్యారని తెలిసింది. తెలంగాణ ప్రజల్లోకి టీడీపీని మళ్లీ తీసుకెళ్లేందుకు ఏం చేయాలి ? అందుకోసం ఎలాంటి వ్యూహరచన చేయాలి ? తెలంగాణలో బీజేపీ, జనసేనలతో కలిసి టీడీపీ రంగంలోకి దిగితే కలిసొస్తుందా ? అనే అంశాలపై ఆ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.
Also Read : Formula E Race Case : ఫార్ములా ఈ రేసింగ్ కేసు వివరాలు ఈడీకి అప్పగించిన ఏసీబీ
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం టీడీపీకి ఆయువుపట్టుగా ఉండేది. ఎంతోమంది అగ్రనేతలు టీడీపీ నుంచే ఎదిగారు. చివరకు ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా టీడీపీలోనే దన్ను లభించింది. చంద్రబాబు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని రేవంత్ డైనమిక్ లీడర్‌గా రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఒకప్పుడు టీడీపీలో కీలక పాత్రలు పోషించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవేంద్ర గౌడ్,నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నేతలు కూడా టీడీపీ(Telangana TDP) నుంచే ఎదిగారు.
Also Read :Fake IPS Officer : పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫేక్ ఐపీఎస్.. ఏపీ హోం మంత్రి సీరియస్
ఒకవేళ తెలంగాణలో టీడీపీ మళ్లీ యాక్టివిటీని మొదలుపెడితే.. బీఆర్ఎస్, బీజేపీల నుంచి పలువురు కీలక నేతలు టీడీపీలోకి చేరే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. గత కొన్ని నెలల వ్యవధిలో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయిన తెలంగాణ ప్రముఖుల్లో మాజీ టీడీపీ నేతలు ఎక్కువమందే ఉన్నారు.తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడిన ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీపీనీ పునరుద్దరిస్తే బాగుంటుందని వారంతా చంద్రబాబుకు సూచించారట. త్వరలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటికల్లా టీ టీడీపీని రీయాక్టివేట్ చేయాలని లీడర్లు కోరుతున్నారట. ఇక తెలంగాణ టీడీపీ చీఫ్ పోస్టు కోసం చాలామంది నేతలు చంద్రబాబుకు దరఖాస్తు చేసుకున్నారట. వారిలో ఎవరికి చంద్రబాబు ఛాన్స్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.