Site icon HashtagU Telugu

BRS Silver Jubilee Celebration : వాటిని బయటకు తీస్తూ బిఆర్ఎస్ భారీ స్కెచ్

Brs 100 Pink Ambassador Car

Brs 100 Pink Ambassador Car

తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా జరుపుకోబోతుంది. ఈ నెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తి వేదికగా సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ (BRS Silver Jubilee Celebration) కు రంగం సిద్ధమైంది. ఈ వేడుకతో ప్రజల్లో జోష్ నింపాలనే ఉద్దేశంతో పార్టీ నేతలు గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. ఎడ్లబండ్లతో ర్యాలీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు.

Gavaskar : ఇండియాలో ఇంచు భూమిని కూడా కదిలించలేరు – పాక్ కు గావస్కర్ వార్నింగ్

ఇక ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది 100 అంబాసిడర్ కార్ల గులాబీ ర్యాలీ. పార్టీ సింబల్ అయినా కార్ ను బయటకు తీస్తూ మరింత అకరించబోతున్నారు, ఈ కార్లను సేకరించి, రిపేర్ చేసి, గులాబీ రంగుతో అలంకరించి ర్యాలీగా తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. రవి యాదవ్ అనే యువ నాయకుడు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా పార్టీకి ప్రజల మద్దతు ఎంతగా ఉందో చూపించాలన్నదే లక్ష్యంగా ఉంది.

సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాత కూడా ఈ కార్లను ప్రతి నియోజకవర్గానికి ఒకటిగా పంపించాలని భావిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పునఃస్థాపనకు మార్గం వేయాలని భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఈ వినూత్న ఆలోచనపై ఉత్సాహంగా స్పందిస్తున్నాయి. గులాబీ అంబాసిడర్ కార్ల ర్యాలీ పార్టీకి చిహ్నంగా మారిన ఆ కారు పునరుత్థానంగా నిలుస్తుందనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం.