Site icon HashtagU Telugu

Pilot Rohith Reddy: ఫామ్ హౌజ్ ఫైల్స్ లో కేసీఆర్ పాత్ర లేదు : పైలట్

Mla Pilot Rohit Reddy

Mla Pilot Rohit Reddy

తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు చేసిన సిట్ ను రద్దు చేస్తూ సీబీఐకి అప్పగించింది. అయితే హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లేలా కనిపిస్తుంది. డివిజన్ బెంచ్ లో ఇదే అనుభవం ఎదురైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఈ కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్న తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ని ఈడీ అధికారులు రెండు రోజులు విచారించారు.

ఫామ్ హౌజ్ పాలిటిక్స్ చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో ‘‘ఈ కేసులో ఆయన పాత్ర ఎటువంటిది? సీబీఐ తీరేంటీ? బీఆర్ఎస్ పార్టీ నెక్ట్స్ స్టెప్ ఎలా వేయబోతోంది?’’ లాంటి విషయాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హ్యాష్ ట్యాగ్ యూ మీడియాతో (Hashtag U) తో షేర్ చేసుకున్నారు. ఆ వివరాల కోసం ఈ పూర్తి ఇంటర్వ్యూను చూడండి.