Site icon HashtagU Telugu

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్‌‌తో ప్రణీత్ టీమ్ సొంత దందా.. అమెరికా నుంచి ఆ ఫోన్ కాల్

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ముడిపడిన మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి.  ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు టీమ్‌కు పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ బాధ్యతను ఆనాటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అప్పగించారు. అయితే ఓవైపు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తూనే.. మరోవైపు వ్యక్తిగత అవసరాల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్‌ను ప్రణీత్‌రావు వాడుకున్నట్లు వెల్లడైంది. పలువురు హవాలా, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి అతడు భారీగా దండుకున్నట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

అసెంబ్లీ ఎన్నికల టైంలో పోలీసుల తనిఖీల్లో దాదాపు రూ.350 కోట్ల నగదు,  300 కిలోల బంగారం, వెయ్యి కిలోల వెండిని  స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ భాగం హవాలా వ్యాపారానికి సంబంధించినదే. హవాలా మార్గంలో సొత్తును రవాణా చేసే వాళ్ల ఫోన్లను ప్రణీత్‌రావు టీమ్ ట్యాప్ చేసి, బాగానే డబ్బులు సంపాదించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెప్పిన ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపైనా వారు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ స్థిరాస్తి వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐ స్థాయి అధికారి.. నల్గొండకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read :Five Tunnel Routes : హైదరాబాద్‌లో ఐదు సొరంగ మార్గాలు.. ఏడాది చివరికల్లా పనులు షురూ ?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో(Phone Tapping Case) ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తాజాగా ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని.. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ‘ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పని చేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్తే మేం కూడా అలాగే చేశాం’ అని సదరు ఉన్నతాధికారితో అన్నట్లు సమాచారం. అంతే కాకుండా, ఎంతైనా మన పోలీసులం ఒకటని.. మా ఇళ్లల్లో సోదాలు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభాకర్ రావు ఫోన్ కు స్పందించిన ఉన్నతాధికారి.. ‘‘మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్ కు  సమాధానం రాసి పంపించండి’’ అని స్పష్టం చేశారట. దీంతో ప్రభాకర్ రావు ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.

Also Read : Rajamouli: రూ.90 లతో అయిపోయే దానికోసం 250 కోట్లు ఖర్చు చేయించిన జక్కన్న?

ఇక ఈ కేసులో అరెస్టయిన ముగ్గుర్నీ విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్టయిన డీఎస్పీ ప్రణీత్‌రావును ఇప్పటికే ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ప్రణీత్‌ను మరోసారి కస్టడీకి అడగనున్నారు. ఆయనతోపాటు అరెస్టయిన అదనపు ఎస్పీ భుజంగరావు, డీఎస్పీ తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు.

Exit mobile version