Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు… రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Written By:
  • Updated On - April 11, 2024 / 09:05 PM IST

Phone Tapping Case: రాష్ట్ర ప్రభుత్వం(State Govt)ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌(Special Public Prosecutor)ను నియమించింది. సీనియర్ న్యాయవాది(Senior Advocat) సాంబశివారెడ్డి(Sambasiva Reddy)ని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రణీత రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న వారిని దర్యాప్తు చేస్తున్న క్రమంలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని, ఇప్పటివరకు 7 చోట్ల వార్ రూమ్ లను ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు.

Read Also: Pregnancy Tips : ప్రెగ్నెన్సీ సమయంలో ఎందుకు జట్టు రాలుతుంది.. మళ్లీ ఎప్పుడు జుట్టు పెరుగుతుంది.?

దీని ద్వారా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, బడా పారిశ్రామికవేత్తలను, వ్యాపార వర్గాలను కూడా టార్గెట్ చేసి, బెదిరింపులకు పాల్పడినట్టు, కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసులో రాష్ట్రవ్యాప్తంగా వార్ రూమ్ లను ఏర్పాటుచేసిన జిల్లాలలో పోలీసుల పాత్ర పైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది.

తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రుల పాత్ర కూడా ఉందన్నది చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వానికి ఇదంతా తెలిసే జరిగిందన్న ఆరోపణలు కూడా వెల్లువగా మారాయి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు ఎర అంశం, అంతేకాదు గత ఎన్నికల్లో పట్టుబడిన ప్రతిపక్ష పార్టీల డబ్బులు కూడా ఫోన్ ట్యాపింగ్ తోనే దొరికినట్టు తెలుస్తుంది.

Read Also: AP Politics: చంద్రబాబుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!

ఇదిలా ఉంటే ఇదే సమయంలో ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే విషయంపై కూడా త్వరలోనే విషయాన్ని వెల్లడిస్తామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.