Site icon HashtagU Telugu

Telangana BJP: ఇండియాలో పెట్రోల్ ధరలు చాలా చీప్: బీజేపీ

Telangana BJP

New Web Story Copy 2023 05 25t152859.648

Telangana BJP: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రూ.60, 70 ఉండే పెట్రోల్ ధరలు ప్రస్తుతం రూ.110 కి చేరింది. దీంతో వాహనదారులు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. సంవత్సర కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో, ధరలను కాస్త తగ్గించాలని కోరుతున్నారు ప్రజలు. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలోనే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా చీప్ అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డి. ప్రపంచంలో పెట్రోల్ ధరలతో పోలిస్తే భారత్ లో ధరలు చాలా తక్కువ అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన కొండా సీఎం కెసిఆర్ పై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంపై కెసిఆర్ అన్ని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రపంచంలో పెట్రోల్ ధరలతో పోలిస్తే భారత్ లో ధరలు చాలా తక్కువ అని అన్నారు కొండా విశేశ్వర్ రెడ్డి. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందని, మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పధంలో పరుగులు పెడుతుంటే తెలంగాణ సీఎం కెసిఆర్ మాత్రం అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన నడుస్తుందని, వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని కొండా విశేశ్వర్ అన్నారు. తెలంగాణాలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణాలో వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి ప్రముఖ రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారిన తరువాత కెసిఆర్ గ్రాఫ్ కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫర్వాలేదనిపించినప్పటికీ అంతర్గత కుమ్ములాట ఆ పార్టీకి గుదిబండగా మారుతుంది. ఇక బీజేపీ మాత్రం హైదరాబాద్, చుట్టూ ప్రక్కల మినహా గ్రామ స్థాయిలో కనిపించడం లేదు. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతాయనడంలో అతిశయోక్తి లేదు.

Read More: Jai Balayya : బాల‌య్య క‌ష్టానికి అవార్డు, బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి దేశంలోనే బెస్ట్‌