Site icon HashtagU Telugu

Hyderabad: కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి చొరవతో నాగోల్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

Hyderabad

New Web Story Copy 2023 07 11t214639.926

Hyderabad: నాగోల్ ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడినా.. మురుగునీరు పొంగిపొర్లి నీరు నిలిచిపోవడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడేవారు. మాటిమాటికి మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తడం ఇక్కడ పరిపాటిగా మారింది. అక్కడ పలు కాలనీలు ఏండ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అపరిష్కృత డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించింది.

మంగళవారం నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మంజులా రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి నాగోల్ లోని పలు కాలనీలలో పర్యటించారు. కాలనీవాసులతో ముచ్చటించి వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత మూడు నెలలుగా ఆనంద్ నగర్ చౌరస్తా నుండి బండ్లగూడ చౌరస్తా వరకు డ్రైనేజీ సమస్య లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాంరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు స్థానికులు. దిల్‍సుఖ్‍నగర్ నుండి నాగోల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు కు వెళ్లడానికి ఇది ప్రధాన రహదారి కావడం వలన ఇక్కడ మురుగునీరు పారుతుండడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రాంతంలో గత మూడు నెలలుగా చాలా ప్రమాదాలు కూడా జరిగాయి అని రాంరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు

ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించిన మల్ రెడ్డి రాంరెడ్డి సంబంధిత అధికారుల్ని హెచ్చరించారు. మూడు నెలల నుండి బండ్లగూడ చౌరస్తా మరియు ఆనంద్ నగర్ చౌరస్తాలలో పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ ల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్డుపై పారుతున్న మురుగునీరు వలన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారనీ, స్థానిక సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. లేనియెడల దీనిపై మేము పోరాడవలసి వస్తుందని హెచ్చరించారు. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు రెండు గంటలలోనే పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను చూసి చలించి, సమస్య పరిష్కారానికి కృషిచేసిన ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రాంరెడ్డి సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాంరెడ్డితో పాటు టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ గాంధీ నాయక్, కొత్తపేట డివిజన్ అధ్యక్షులు కిషోర్ గౌడ్, గడ్డి అన్నారం డివిజన్ అధ్యక్షులు వేణు యాదవ్, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ జైపాల్ రెడ్డి, NSUI సాయి మరియు ఇతర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Read More: Rajamouli : తమిళనాడు ట్రిప్.. అక్కడి దేవాలయాలు, ఫుడ్‌ని పొగుడుతూ రాజమౌళి స్పెషల్ ట్వీట్..