Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు.. పదివేలకుపైగా మొక్కలు నాటిన ప్రజలు!

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 09:51 PM IST

రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తాజాగా తన 64వ పుట్టిన రోజును వేడుకలను పుర‌స్క‌రించుకున్నారు. తాజాగా దయాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక దయాకర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలలో పాల్గొన్నారు.ఇక సిఎం గారి పిలుపు హ‌రిత‌హారం, ఎంపీ జోగిన ప‌ల్లి సంతోశ్ పిలుపు మేర‌కు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా, మంత్రి స‌తీమ‌ణి, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి ఉషా ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం మొత్తాన్ని ప‌ర్య‌టించారు. ఈ నేపథ్యంలోనే ఉషా దయాకర్ ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌తో క‌లిసి మొక్క‌లను నాటారు.

అదేవిధంగా మంత్రి పిలుపు మేర‌కు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణులు, ద‌య‌న్న అభిమానులు పెద్ద ఎత్తున మొక్క‌లు నాటారు. ప్రతి గ్రామానికి క‌నీసం 100 మొక్కలు చొప్పున దాదాపుగా 10వేల‌కు పైగా మొక్క‌లు నాటారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆటా 17వ మ‌హా స‌భ‌ల కోసం అమెరికా వెళ్ళారు. అయితే త‌న జ‌న్మ‌దిన వేడుకుల‌ను నిరాడంబ‌రంగా జ‌రుపుకోవాల‌ని, సిఎం కెసిఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా హ‌రిత‌హారం మొక్క‌లు నాటాల‌ని, అలాగే రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోశ్ కుమార్ పిలుపు మేర‌కు గ్రీన్ చాలెంజ్ లో భాగంగా, విరివిగా మొక్క‌లు నాటాల‌ని, పేద‌ల‌కు, రోగుల‌కు పండ్లు పంపిణీ చేయాల‌ని సూచించారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునందుకుని ఆయ‌న స‌తీమ‌ణి, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి ఉషా ద‌యాక‌ర్ రావు నియోజ‌క‌వ‌ర్గం మొత్తాన్ని ప‌ర్య‌టించడం జరిగింది. తొర్రూరు మండ‌లం మ‌డిప‌ల్లి బ్రిడ్జీ వ‌ద్ద కొంద‌రు ఆయ‌న అభిమానులు భారీ క‌టౌట్ క‌ట్టి పుట్టిన రోజు వేడుక‌లు చేయడంతో పాటు పాలకుర్తి హాస్పిటల్ లో రోగులకు పండ్లు, పేదలకు హెల్మెట్ లను పంపిణీ చేశారు. పాలకుర్తిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులతో దయాకర్ ఆకారం తో ఉత్సవాలు చేశారు. అనంతరం సమీపంలోని సోమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.