Telangana: తెలంగాణాలో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించడంలో, రైతు రుణమాఫీ విషయంలో, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇలా ఇచ్చిన హామీలను నిరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారన్న అపవాదు మూటగట్టుకున్నారు.పైగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గంలో పర్యటించినప్పుడు హామీలపై ప్రశ్నిస్తున్నారు. నెరవేర్చని హామీలను ఎత్తిచూపుతూ స్థానిక ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగులుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై ప్రజలు తిరగబడ్డారు. దళితబంధు విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యేను స్థానిక దళితులు అడ్డుకున్నారు. .ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఎమ్మెల్యే తప్పొప్పులని, హామీలని నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని స్థానికుల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ తరహా నిరసనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి..
Telangana: గో.. బ్యాక్ అంటూ ఎమ్మెల్యే ఆరురి రమేష్ కు నిరసన సెగ

Telangana (4)