Pension Hike: దివ్యాంగుల పింఛన్‌దారులందరికీ రూ. 1,000 పెంపు.. 5.16 లక్షల మందికి ప్రయోజనం..!

తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. తెలంగాణలో వికలాంగులకు ఆసరా పింఛన్లు పెంచుతామని (Pension Hike) కేసీఆర్ ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - June 10, 2023 / 06:40 AM IST

Pension Hike: తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. తెలంగాణలో వికలాంగులకు ఆసరా పింఛన్లు పెంచుతామని (Pension Hike) కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పింఛన్లు (Pension Hike) వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని కేసీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సమాజం అంతా బాగుండాలని కేసీఆర్ అన్నారు. ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ, గోదావరిపై వంతెన, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి శంకుస్థాపనతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి శంకుస్థాపన, ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

వికలాంగుల పెన్షన్‌ను రూ.1000 పెంచుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ.4,116 పింఛన్ చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం వికలాంగులకు ప్రతినెలా రూ.3,116 పింఛన్ చెల్లిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యేక జిల్లా కోసం గతంలో మంచిర్యాల జిల్లా ప్రజలు అనేక ధర్నాలు నిర్వహించారని, దీనిపై తమ ప్రభుత్వం మంచిర్యాలతో పాటు 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు.

Also Read: Lavanya – Varun : వరుణ్ – లావణ్య నిశ్చితార్థం.. ఎంత క్యూట్‌గా ఉన్నారో మెగా కపుల్..

దివ్యాంగుల పింఛన్‌దారులందరికీ రూ. 1,000 పెంపు

దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను సీం కేసీఆర్‌ రూ.1,000 పెంచడంతో మొత్తం 5.16 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. వచ్చే నెల నుంచి రూ. 4,116 చొప్పున లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. కాగా, ఆసరా పథకంలోని మిగతా అందరికీ కూడా రూ.1,000 పింఛన్‌ పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రకటన వస్తుందని సమాచారం. దీంతో 44.82 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.