మరో రెండు నెలల్లో ఎన్నికలు (Telangana Elections) రాబోతుండడం తో మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని బిఆర్ఎస్ (BRS) కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు కేసీఆర్ (KCR). రైతుల కోసం రైతు బంధు, యాదవ సోదరులకు గొర్రెల యూనిట్ల పంపిణీ, గంగపుత్రులకు చేప పిల్లల పంపిణీ, దళితుల కోసం దళిత బంధు కింద రూ.10 లక్షలు, వెనుకబడిన కులాలకు, చేతివృత్తులవారికి చేయూతనందించేందుకు బీసీ బంధు, ముస్లింలకు చేయూతనిచ్చేందుకు లక్ష ఆర్థిక సాయాన్ని అందించిన కేసీఆర్..తాజాగా ఎరుకల వారి సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. రూ.60 కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది. అయితే.. ఈ పథకాన్ని ట్రైకార్ ద్వారా అమలు చేయనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు మరో పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారట. ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్… ప్రతిపక్షాల ఊహకు అందని విధంగా పథకాలకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతులందరికీ పెన్షన్ అందించే సరికొత్త స్కీమ్ పై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రైతుబంధు సాయం ఎకరానికి రూ. 6,000, కేసీఆర్ కిట్ పథకం సాయం రూ. 15 వేలకు పెంచాలని….కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని కూడా పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనిపై అతి త్వరలోనే ప్రకటన రానుందని అంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు వారాలుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతుండగా..తాజాగా ఆయన ఛాతికి ఇన్ఫెక్షన్ అయినట్లు..దీంతో మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. కేటీఆర్ కోలుకోగానే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Read Also : Telangana: సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి 250 మంది మైనార్టీ అభ్యర్థులు ఎంపిక