గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్ల(Telangana Challan)పై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు అవ్వగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలు అయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాగా ట్రాఫిక్ చలాన్ల రాయితీ ప్రకారం..ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు , తోపుడుబండ్లపై 90శాతం రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50శాతం రాయితీని కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36శాతంమాత్రమే క్లియర్ అయ్యాయి. చలాన్ల గడువును రెండుసార్లు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తుందని అంత అనుకున్నారు కానీ ప్రభుత్వం మాత్రం పొడగించలేదు.
ఇక 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల చలాన్లు వసూలు కాగా.. మళ్లీ ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లు మాత్రం కట్టలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్‌లో ఉండడం తో.. పెండింగ్ చలానాలపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పిస్తూ వస్తుంది. కానీ పూర్తి స్థాయిలో వాహనాద్రులు తమ పెండింగ్ చలాన్ లు కట్టేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదు.
Read Also : Karnataka Budget 2024: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య నిర్మూలనకు రూ. 2700 కోట్లు..!