Site icon HashtagU Telugu

Peddi Reddy Resigns to BRS : బిఆర్ఎస్ కు పెద్దిరెడ్డి రాజీనామా..

Peddireddy Resign

Peddireddy Resign

బిఆర్ఎస్ (BRS) కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలు పార్టీ కి గుడ్ బై చెపుతూ కాంగ్రెస్ , బిజెపి లలో చేరుతున్నారు. ఇప్పటికే అనేక మంది పార్టీ ని వీడగా..తాజాగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి (Peddi Reddy) సైతం షాకిచ్చారు. బుధువారం తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. రెండు దశాబ్దాల కాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, శాసనసభ్యుడిగా తనదైన శైలిలో రాజకీయం చేసిన పెద్దిరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయడం కలకలం రేపింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టయింది.

We’re now on WhatsApp. Click to Join.

రాజీనామా అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తాను టీఆర్ఎస్ పార్టీలో చేరడం పెద్ద తప్పిదమని, ఉమ్మడి జిల్లాలో మంత్రిగా పనిచేసిన తనకు కేసీఆర్ ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సోమవారం కరీంనగర్ లో జరిగిన సమావేశంలో కేసీఆర్ తనకు ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం మనసు కలచివేసిందని, అంతకు ముందు తాను బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. హుజరాబాద్‌లో కౌశిక్ రెడ్డి గెలుపునకు తన వంతు పాత్ర పోషించానని అయినా కేసీఆర్ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, దీంతో మనసు చెదిరి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై తాను కార్యకర్తలతో, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

Read Also : Health Card : రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కారు మరో గుడ్‌న్యూస్