PEC Meeting : లోక్ సభ అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుంది – సీఎం రేవంత్

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 08:56 PM IST

లోక్ సభ (Lok Sabha) అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుందని..అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను ఖర్గే, AICC కి అప్పగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (PEC Meeting) గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో సమావేశమైంది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, సభ్యులు, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో అభ్యర్థుల ఎంపిక అనేది పూర్తిగా AICC చూసుకుంటుందని తెలిపారు. అలాగే లోక్ సభ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మార్చ్ 3వ తేదీ వరకు లోక్ సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ధరకాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక కమిటీ వేయడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

17 పార్లమెంట్ సెగ్మెంట్ లకు మంత్రులను, ఇంచార్జీ లను నియమించినట్లు తెలిపారు. ఇక మోడీ ప్రధాని అయ్యాక ఏకంగా వంద లక్షల కోట్ల అప్పులు చేసారని రేవంత్ ఆరోపించారు. మణిపూర్ లో విధ్వంసం జరిగితే కనీసం ఆ పర్యటనకు మోడీ వెళ్లలేదు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకూ భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఆయన అవసరం దేశానికి చాలా అవసరం ఉంది. ఆయన ప్రధాని అవ్వాలంటే.. తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అవుతుందన్నారు. బీఆర్ఎస్ ను, బీజేపీని నిలువరించేది కాంగ్రెస్ పార్టీనే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రం ప్రయోజనాలను ఏనాడూ కేంద్రాన్ని అడగలేదు. అందుకే మోడీ ఇవ్వలేదన్నారు.

‘బిఆర్ఎస్ పార్టీ ని ప్రజలు ఇప్పటికే బొంద పెట్టారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన MLCలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే.. రాజకీయ కుట్రతో KCR వాయిదా వేస్తున్నారు. ప్రొ. కోదండరాం గొప్పతనం ఒకరు చెప్పాలా..? తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను BRS నేతలు ప్రశ్నించడం దారుణం. వాళ్ల చెప్పులు మోసే వారితో కోదండరాంను BRS పోల్చడంలో ఏమైనా అర్థం ఉందా..?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ 60రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తుందని వెల్లడించారు.

Read Also : Hemant Soren: జార్ఖండ్ ప్రభుత్వం కొనసాగుతుంది: కాంగ్రెస్