Site icon HashtagU Telugu

Kavitha Bail : బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ – ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

Kavitha Bail Mahesh

Kavitha Bail Mahesh

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha Bail)కు బెయిల్‌ మంజూరు కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పటాకులు కాల్చి స్వీట్స్ పంచుకుంటున్నారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని.. రాజకీయ ప్రేరేపిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని వారంతా అభిప్రాయపడుతున్నారు. బిఆర్ఎస్ శ్రేణుల కామెంట్స్ ఇలా ఉంటె..కాంగ్రెస్ పార్టీ మాత్రం కీలక ఆరోపణలు చేస్తుంది. కేటీఆర్, హరీశ్ రావు బీజేపీ నేతల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ బెయిల్ తో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని, దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అధికార కాంగ్రెసు, సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, బిఆర్ఎస్ ఒక్కటవుతున్నాయని ఆయన మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో ఈడీ అధికారులు కవిత(BRS MLC Kavitha)ను మార్చి 15న అరెస్ట్​ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎంతగానో ట్రై చేసిన కుదరకపోవడం తో సుప్రీం కోర్ట్ (Supreme Court) ను ఆశ్రయించారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్ట్ లో విచారణ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని వివరించింది.

ఇక ఢిల్లీMLC కవితకు బెయిల్ వచ్చినప్పటికీ KTR ఏం మాట్లాడకుండానే సుప్రీం కోర్టు నుంచి వెళ్లిపోయారు. బెయిల్ కు సంబంధించిన మిగతా ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు ఆయన ఆటోలో బయల్దేరారు. ‘సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. న్యాయం గెలిచింది’ అని తాజాగా KTR ట్వీట్ చేశారు.

Read Also : ‘Nabanna March ​’ : నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం