తెలంగాణ శాసన మండలి సభ్యులు(ఎమ్మెల్సీ), ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud ) శనివారం టి-సాట్ (తెలంగాణ శాటిలైట్ స్కిల్ అండ్ అకడమిక్స్) ను సందర్శించారు. సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి (CEO Bodanapally Venugopal Reddy) ఆహ్వానం మేరకు టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సీఈవో వేణుగోపాల్ రెడ్డిని అభినంధించారు.
తొలి సారి టి-సాట్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ ను సీఈవో వేణుగోపాల్ రెడ్డి ఘనంగా సత్కరించి, సన్మానించారు. అనంతరం కార్యాలయంలోని వివిధ విభాగాలను సీఈవో తో కలిసి పరిశీలించారు. టి-సాట్ పనితీరుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా టి-సాట్ నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా అవసరమై సహాకారాన్ని అందించేందుకు సహకరిస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.
Read Also : Samsung : డిజిటల్ హెల్త్, ఏఐ ఇతర కొత్త సాంకేతికతలపై సామ్‌సంగ్ ఒప్పందం..