Revanth Reddy:రేవంత్ పొలిటికల్ ‘షో’

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాకా కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుందని ఆశించిన చాలామంది డిప్రెస్ అవుతున్నట్లు కన్పిస్తోంది.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాకా కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుందని ఆశించిన చాలామంది డిప్రెస్ అవుతున్నట్లు కన్పిస్తోంది. రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచినా కాంగ్రెస్ లో ఎలాంటి మార్పు కన్పించట్లేదట. ఈ విషయంలో క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.పార్టీకి కొత్తబాస్ వచ్చి అరసంవత్సరం గడిచినా పార్టీలో కొత్త కమిటీలు వేయకపోవడం పట్ల కాంగ్రెస్ సీరియస్ అండ్ సీనియర్ నేతలు తమకి ఈ పదవిలేదని ఆందోళనగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో ఎంతో ఇమేజ్ ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీని సరిగ్గా నడిపించే నాయకుడు లేక దాదాపు జీరో స్థాయికి పడిపోయింది.  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్  అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని కాంగ్రెస్ లోని మెజారిటీ  కార్యకర్తలు  కోరుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష్య భాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

పార్టీలోని నేతల మధ్య గొడవలు, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం తప్పా కాంగ్రెస్ లో జరిగిన డెవలప్మెంట్స్ పెద్దగా ఏమీ కనిపించకపోవడం పార్టీ క్యాడర్ నే కాకుండా నేతలని కూడా ఆలోచన లో పడేసింది. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసినా, పార్టీలో ఆశించిన స్థాయిలో జోష్ రాలేదని  పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట.రేవంత్ అధ్యక్ష భాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో అధికార ప్రతినిధులను నియమించడం మినహా మరే  కమిటీని నియమించలేదు. దీంతో పార్టీలో తమకు ఏదో ఒక  కమిటీ లో చోటుదక్కుతుందని ఆశపడుతోన్న నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు. పార్టీ కమిటీలు వేయకుండా ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. పార్టీ అంతర్గత గొడవలు కూడా క్యాడర్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని విధేయతను దూరం చేస్తున్నాయట.పార్టీని ముందుండి నడపాల్సిన రేవంత్ కూడా వ్యక్తిగత ఇమేజ్ తో ఇష్టారితిలో వ్యవహరించడం పార్టీకి నష్టం చేస్తుందని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారట.

ఒకపక్క రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ లు పోటా పోటీ కార్యక్రమాలు చేస్తోంటే కాంగ్రెస్ మాత్రం నామమాత్ర కార్యక్రమాలకే పరిమితమైందని, వరి ధాన్యం కొనుగోలు విషయాన్ని కాంగ్రెస్ వాడుకోవాల్సినంతగా వాడుకోలేదని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.పలు కారణాలతో కాంగ్రెస్ క్యాడర్ లో నిస్సహాయత కనిపిస్తోందనేది కాదనలేని సత్యం.ఇది పార్టీ కి చాలా నష్టం చేస్తుందని గాంధీ భవన్లో చర్చ జరుగుతొందట.ఇక రేవంత్సొంత ఇమేజ్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పార్టీ నష్టపోతుందని మరి కొందరు నేతలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావాలని కోరుకున్న నేతలు కూడా ఇప్పుడు పార్టీ పరిస్థితి చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. నేతలంతా కలిసిపోయినట్లు కనిపిస్తోన్నా వాళ్ళ క్యాడర్ మధ్య ఇబ్బందులు అలాగే ఉన్నాయట. ఇవి సమసిపోయి ప్యూర్ హార్టెడ్ గా నాయకులు, క్యాడర్ కలవకపోతే  కాంగ్రెస్ కి మరో ఛాన్స్ ఉండదని విశ్లేషకుల అభిప్రాయం.