పొంగులేటి (Minister Ponguleti ) చెప్పినట్లే బాంబులు పేలుతున్నాయి. నవంబర్ 01 నుండి బాంబులు పేలతాయని, బిఆర్ఎస్ కీలక నేతలు (BRS Leaders) అరెస్ట్ లు కాబోతున్నారని..ఇలా అనేక హెచ్చరికలు జారీ చేసారో లేదో..బిఆర్ఎస్ లో ప్రస్తుతం అలజడి మొదలైంది.నిన్న మొత్తం కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ (Raj Pakaala) లో జరిగిన పార్టీ వ్యవహారం హాట్ టాపిక్ గా నడువగా..ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ (PCC chief Mahesh Kumar) మరో బాంబు పేల్చాడు.
తెలంగాణలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతాయని, కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులు త్వరలోనే కాంగ్రెస్ లోకి వస్తారని…ప్రస్తుతం వారంతా తమకు టచ్ లోనే ఉన్నారని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పెద్ద బాంబు పేల్చాడు. ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరికల పై స్పందిస్తూ, పాత మరియు కొత్త నాయకత్వం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కొంతమంది ఎమ్మెల్యేల్ని డీసీసీ అధ్యక్షులుగా నియమించే ప్రణాళిక ఉందని , కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్ల జైలు కూడా తక్కువేనని , నిరసనల పేరిట మాజీ మంత్రి హరీష్ రావు మరియు కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Read Also : Lawrence Bishnoi : సల్మాన్ ఖాన్ వ్యవహారం.. పప్పూయాదవ్‌కు లారెన్స్ గ్యాంగ్ వార్నింగ్