Site icon HashtagU Telugu

Telangana Formation Day 2024 : పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్

Pawan Kalyan (6)

Pawan Kalyan (6)

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్బంగా సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర ట్వీట్ చేసారు. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందన్నారు.

1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వతంత్రం సిద్ధించిందని తెలిపారు. స్వాతంత్రం కోసం తెలంగాణ మరో రెండేళ్లు వేచిచూడవలసి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 60 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సకల జనుల కల సాకరమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ధ కాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తపోరాటాలకు పురిటి గడ్డ అయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తి నింపిందని స్పష్టం చేశారు.

ఇక్కడ గాలిలో.. నేలలో.. మాటలో చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడిందని కొనియాడారు. నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకుల సదా గుర్తెరగాలని హితవు పలికారు. ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా అందాలని కాంక్షించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రపథంలో పాలకులు నిలపాలని కోరుకున్నారు. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింపజేయాలన్నారు. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరులకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ దశాబ్ధ వేడుల సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈరోజు ఉదయం, సాయంత్రం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ఫై వేడుకలను నిర్వహిస్తుంది. లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. చిన్నారులతో వచ్చేవారికి ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ జోన్, ఫొటో జోన్లను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్ కు చేరుకుని స్టాళ్లను సందర్శిస్తారు. 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహణకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ సమయంలోనే 13 నిమిషాల జయజయహే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేయనుంది ప్రభుత్వం. తర్వాత కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానించనున్నారు.

ఇటు తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. మూడురోజుల వేడుకల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం ఉదయం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించే సమావేశానికి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ప్రసంగిస్తారు.

Read Also : USA Beat Canada: కెనడాను చిత్తును చేసిన అమెరికా.. 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం