తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కాలుకు గాయమైన సంగతి తెలిసిందే, నిన్న అర్ధరాత్రి బాత్రూం లో కాలుజారీ కింద పడడంతో ఆయన ఎడమ తుంటి ఎముక విరిగినట్లు డాక్టర్స్ తెలిపారు. ఆపరేషన్ చేసి తుంటి ఎముక రీప్లేస్ చేయనున్నట్లు హెల్త్ బులెటిన్ లో వివిఆరించారు. ఇక కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రిలోని వివిధ విభాగాల వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కేసీఆర్ గాయపడిన విషయం తెలిసి రాజకీయ పార్టీల తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కేసీఆర్ క్షేమంగా ఉండాలని..త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ తో పాటు పలువురు రాజకీయ నేతలు ట్వీట్స్ చేయగా..తాజాగా జనసేనధినేత పవన్ కళ్యాణ్ సైతం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. కేసీఆర్ గారు గాయపడగా విషయం తెలిసి ఎంతో బాధేసిందని..త్వరగా ఆయన తన గాయం నుండి బయటపడాలని ..క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుతం యశోద హాస్పటల్ లో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉదయం నుండి కూడా బిఆర్ఎస్ నేతలు , అభిమానులు హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు. ఇక సీఎం రేవంత్ సైతం కేసీఆర్ ఆరోగ్యం ఫై అరా తీస్తూ..మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్స్ ను కోరారు.
Read Also : Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం