Site icon HashtagU Telugu

Ramoji Rao : గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టిన రామోజీ తట్టుకుని నిలబడ్డాడు – పవన్ కళ్యాణ్

Pawan Ramojirao

Pawan Ramojirao

ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా రామోజీరావు తట్టుకుని నిలబడ్డారని సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. రామోజీరావు మరణ వార్త తెలియగానే దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పవన్…మధ్యాహ్నం ఢిల్లీ నుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ ..దర్శకుడు త్రివిక్రమ్ , నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) తో కలిసి నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ..రామోజీరావు (Ramoji Rao) మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచి వచ్చిన వారే అని… ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు రామోజీరావు అని పవన్ కొనియాడారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారని , అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్‌సిటీని నిర్మించారని వెల్లడించారు. ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా రామోజీరావు తట్టుకుని నిలబడ్డారని తెలిపారు. రామోజీని గత 15 ఏళ్లలో ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విషయం ఆయనకు తెలియజేయాలి అనుకున్నా. ప్రమాణస్వీకారం తర్వాత కలుద్దామనుకున్నా. కానీ ఇలా జరిగిపోయింది’ అని పవన్ విచారం వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని , జనసేన తరఫున సంతాపం తెలియజేస్తున్నట్లు అని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also : Chandrababu : రామోజీ రావు చాలా విషయాల్లో మార్గనిర్దేశం చేశారు