Pawan Kalyan: కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. జనం ప్రభంజనం!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొండగట్టుకు బయల్దేరారు. జనసేన నేతలు భారీ కాన్వాయ్‌తో ఆయన వెంట వెళ్లారు.

  • Written By:
  • Updated On - January 24, 2023 / 12:20 PM IST

నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొండగట్టుకు బయల్దేరారు. జనసేన నేతలు భారీ కాన్వాయ్‌తో ఆయన వెంట వెళ్లారు. తన ప్రచార రథం ‘వారాహి’కి అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు చేయించనున్నారు. వేద పండితులు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే కొండగట్టుకు చేరుకున్నారు. భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో పవన్ కట్టుదిట్టమైన భద్రత మధ్య అతికష్టం మీద ఆలయానికి చేరుకోవాల్సి వచ్చింది. ‘‘సీఎం, సీఎం.. జై పవన్ జైజై పవన్’’ అనే నినాదాలతో కొండగట్టు మార్మోగింది. పవన్ కూడా సెంటిమెంట్ ఎక్కువే. అయితే 2009లో కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ వాహనంపై హైటెన్షన్ వైర్ పడటంతో తృటిలో తప్పించుకున్నారు. కొండగట్టు (Kondagattu) ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని, అందుకే ఈ ఆలయం నుంచే ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నానని పవన్ బలంగా నమ్మాడు.

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల సమరానికి (AP Elections) సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత నెలలో ప్రత్యేకంగా రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఆవిష్కరించారు. ప్రచార వాహనంలో హై-సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, CCTV కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ముస్తాబైన ఈ వాహనాన్ని ఉద్దేశించి ‘వారాహి ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాడు’ అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మిలటరీ బస్సును తలపించే ఈ వాహనాన్ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్షుణంగా పరిశీలించాడు. సాంకేతిక నిపుణులతో వాహనం వివిధ ఫీచర్లను చర్చించి, కొన్ని మార్పులను సూచించాడు. ఏప్రిల్-మే 2024లో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారం చేయడానికి పవన్ ఈ వాహనాన్ని ఉపయోగిస్తాడు.

ఇక దసరా తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనను (Political tour) ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అదే వాయిదా పడింది. ఇప్పుడు రాబోయే కొద్ది వారాల్లో పవన్ పర్యటనను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఆలివ్ గ్రీన్ వాహనం నడపడానికి పవన్ కళ్యాణ్ కు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారి ఒకరు చెప్పడంతో వాహనం రంగుపై వివాదం చెలరేగింది. మోటారు వాహన చట్టం ప్రకారం ఆర్మీ సిబ్బందికి తప్ప మరే ప్రైవేట్ వాహనానికి ఆలివ్ గ్రీన్ కలర్ ఉపయోగించరాదని అధికారి తెలిపారు. కాగా అధికార వ్యతిరేక (YCP) ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నారు.

Also Read: 200 Cr for Pathaan?: రిలీజ్ కు ముందే రికార్డులు.. పఠాన్‌కు 200 కోట్ల ఓపెనింగ్?