Site icon HashtagU Telugu

Pawan Kalyan : తెలంగాణ స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్న – పవన్ కళ్యాణ్

Pawan Wgl

Pawan Wgl

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campagin)లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) నేడు వరంగల్ (Warangal) సభలో పాల్గొన్నారు. బిజెపి (BJP) తో కలిసి జనసేన (Janasena) ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి మద్దతు పలుకుతుంది. ఈ క్రమంలో నేడు హన్మకొండ లో బిజెపి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం తనకు ఎంతో బలాన్ని .. స్ఫూర్తిని ఇచ్చిందని..అదే బలం తో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని.. గుండాల పాలన నడుస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని పవన్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయానని, కనీసం బీసీ ముఖ్యమంత్రి అయిన చూసే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. బీసీ సీఎంను చూడాలన్న ఉద్దేశంతోనే తాను బిజెపితో కలిశానని..తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన పోరాటానికి తెలంగాణ యువత కూడా అండగా ఉంటుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఇకపై తాను తెలంగాణలో కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. ఏపీలో తాను ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అదేవిధంగా తిరుగుతానని పేర్కొన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని .. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అని అన్నారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు.

Read Also : KTR Phone Call Leaked : వైరల్ గా మారిన కేటీఆర్ ఫోన్ కాల్..సిరిసిల్లలో కష్టమేనా..?