Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్.!

Political parties NTR

Pawan Kalyan

తాను రాజకీయాల్లో ఫెయిలయ్యానంటూ జనసేనాని పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సీఏ స్టూడెంట్స్ ప్రోగ్రాంలో పవన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను 2019ఎన్నికలలో దెబ్బతిన్నాను. కానీ అక్కడితో ఆగిపోలేదు. ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడ్డాను. మీరూ అలాగే ఉండాలి. CA పాసవ్వడం ఎంతకష్టమో నాకు తెలుసు. ఓటమికి కుంగిపోకండి. అని పవన్ చెప్పారు.

నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ని. లేదు..వాస్తవాన్ని అంగీకరించాలి. నేనేమీ ఇందుకు బాధపడటం లేదు. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ హాఫ్ వే టు సక్సెస్. నేను నా వైఫల్యాల్ని మంచిగానే భావిస్తాను. చెడుగా భావించను. ఎందుకంటే నేను ఎంతో కొంత సాధించాను. సమాజంలో మార్పుని కోరే ఇతరుల్లా నేను కాను. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎప్పటికీ మర్చిపోకండి. వాళ్లే మీకు హీరోలు. మన జీవితంలో మధ్యలో ఎవరు వచ్చినా వెళ్లినా మన తుది శ్వాస వరకూ ప్రేమగా ఉండేది తల్లిదండ్రులేనని అన్నారు. జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల్ని ఉదహరిస్తూ విద్యార్ధుల్లో చైతన్యం నింపే మాటలు చెప్పారు.