Site icon HashtagU Telugu

Nampally Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్

Nampally Fire Accident

Nampally Fire Accident

Nampally Fire Accident: హైదరాబాద్ లో 24 గంటల వ్యవధిలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రమాద పరిస్థితుల్ని తెలుసుకునేందుకు పర్యటనకు సిద్ధమయ్యారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. బాధితులను తెలంగాణ గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ కోరారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారు, మరియు అస్వస్థతకు గురైనవారికి మెరుగైన చికిత్సను అందించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. భవనాలలో రసాయనాలు, ఇంధనాలు నిల్వ చేయడం వల్ల ఈ ఘోరం చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం ఉందని, నివాస ప్రాంతాల్లో ప్రమాదానికి ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

నాంపల్లి బజార్ ఘాట్ లో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారం. ఈ ఘటనలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ప్రదేశంలో ఓ అపార్ట్ మెంట్ కింది భాగంలో గత కొన్నేళ్లుగా ఈ కెమికల్ గోడౌన్ ఉంది. ఈ రోజు ఉదయం వేళ మంటలు వ్యాపించి.

Also Read: Hyderabad Fire Accidents : హైదరాబాద్ లో పలుచోట్ల భారీ అగ్ని ప్రమాదాలు…కేటీఆర్ పర్యటన