ప్రజాగాయకుడు, తెలంగాణ(Telangana) ఉద్యమనేత, విప్లవకారుడు గద్దర్ (Gaddar) నేడు అపోలో హాస్పిటల్ లో మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ చికిత్స తీసుకుంటూ పరనించారు. గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకాన్ని విషాదంలో ముంచింది. గద్దర్ మరణంపై సినీ, రాజకీయ, ప్రజా సంఘాల నేతలు సంతాపం తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు.
పలువురు ప్రముఖులు గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని తెలుపుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గద్దర్ పనిచేశారు. యువతను ఉద్యమం వైపుకు ప్రేరేపించడంలో తనదైన పాత్ర ఉంది. సర్జరీకి ముందు కూడా ఆయనతో మాట్లాడాను. రాజకీయం పద్మవ్యూహం అనే నాకు చెప్పారు. పాటను కూడా ఆడియో రూపంలో తనకు పంపించారు. త్వరగా కోలుకొని వస్తారని భావించాను. కానీ ఆయన మన మధ్య లేరనే వార్త నన్ను కలిచి వేసింది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కెసిఆర్ గారిని కోరుతున్నాను. నేడు తెలంగాణకు చాలా బాధాకరమైన రోజు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు.
Also Read : Gaddar : మూగబోయిన ఉద్యమ గళం..