Site icon HashtagU Telugu

Pawan Kalyan Meets Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ.. 45 నిమిషాల పాటు చర్చ..!

Pawan Kalyan Meets Amit Shah

Compressjpeg.online 1280x720 Image 11zon (1)

Pawan Kalyan Meets Amit Shah: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Pawan Kalyan Meets Amit Shah) సమావేశమై బీజేపీ-జనసేన పొత్తుపై చర్చించారు. వీరిద్దరు దాదాపు 45 నిమిషాల పాటు సంభాషించారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దాదాపు వారం రోజుల క్రితం కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌తో తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పొత్తుపై చర్చలు జరిపారు. తెలంగాణలో కనీసం 30 స్థానాల్లోనైనా పోటీ చేయాలని తమ పార్టీ క్యాడర్ నుంచి ఒత్తిడి వచ్చిందని ఈ భేటీలో పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో అన్నారు. అయితే, అమిత్ షాతో భేటీకి సంబంధించిన విశేషాలను పవన్ కళ్యాణ్ మీడియాతో పంచుకోలేదు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల వాటాపై మరింత స్పష్టత వచ్చేలా బీజేపీలోని అగ్రనేతలతో సంభాషించేందుకు జనసేన అధినేత మరో రెండు రోజుల పాటు న్యూఢిల్లీలోనే ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Also Read: Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

నేడు తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేడు రాష్ట్రానికి రానున్నారు. ఈరోజు రాత్రి 10. 15 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకొని నేషనల్ పోలీస్ అకాడమీ వెళ్లనున్నారు. రేపు ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ లో సూర్యాపేటలో జరిగే జనగర్జన సభకు వెళ్లనున్నారు. తిరిగి 5. 45కు బేగంపేట చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.