Pawan Kalyan : రేపే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక తొలిసారి తెలంగాణలోని ఆంజనేయస్వామి ప్రసిద్ధ క్షేత్రం కొండగట్టుకు రాబోతున్నారు.

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 04:05 PM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక తొలిసారి తెలంగాణలోని ఆంజనేయస్వామి ప్రసిద్ధ క్షేత్రం కొండగట్టుకు రాబోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర ముందు వాహనానికి పూజలు చేయించడానికి కొండగట్టు వెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెళ్తున్నారు.

ఇవాళ రాత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఇంటికి రానున్నారు. రేపు ఉదయం 7 గంటలకు మాదాపూర్ లోని తన నివాసం నుండి రోడ్డు మార్గాన కొండగట్టుకు బయల్దేరుతారు. 11 గంటలకు కొండగట్టుకు చేరుకొని ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాదాపు రెండు గంటల పాటు ఆలయంలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అయి సాయంత్రం 5 గంటల వరకు చేరుకుంటారు.

ఇక పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తుండటంతో తెలంగాణ జనసేన నేతలు ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శి, నటుడు సాగర్ పవన్ కళ్యాణ్ పర్యటనపై మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక జనసేన అధినేత పవన్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. రేపు హైదరాబాద్ నుంచి ఉదయం కొండగట్టు అంజన్న ఆలయానికి బయలుదేరుతారు. పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నారు కాబట్టి అభిమానులు, జనసేన కార్యకర్తలు సంయమనం పాటించాలి. త్వరలోనే తెలంగాణ నేతలతో సమావేశం పెడతారు. తెలంగాణలో ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరేందుకు వస్తున్నారు. దీనిపై త్వరలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారు అని తెలిపారు.

Also Read : Ramoji Rao : వైజాగ్‌లో ఫిలింసిటీ పవన్ ఆలోచన.. రామోజీ పేరు పెడతామన్న చంద్రబాబు..